మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పూజా ఖేడ్కర్ తండ్రి పోటీ
తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి సివిల్స్ ఎంపిక ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మహారాష్ట్రకు చెందిన పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని UPSC రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె తండ్రి దిలీప్ ఖేడ్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అహ్మద్‌నగర్ దక్షిణ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు.