తిరుపతిలోని ఆలయాలకు బాంబు బెదిరింపులు

77చూసినవారు
తిరుపతిలోని ఆలయాలకు బాంబు బెదిరింపులు
తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం కార్పొరేట్ హోటళ్లతోపాటు వరాహ స్వామి ఆలయం, ఇస్కాన్‌ ఆలయాల పేర్లు మెయిల్‌లో పొందుపరిచారు. దీంతో పోలీసులు నగరంలోని మూడు హోటల్స్‌లో తనిఖీలు చేపట్టారు. తిరుపతిలో వరాహ స్వామి ఆలయం లేనందున ఊపిరి పీల్చుకున్నారు. అంతలో ఇస్కాన్‌ ఆలయం పేరుతో మెయిల్‌ రావడంతో డాగ్, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు అక్కడ సోదాలు జరిపి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్