జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయానికి సంబంధించిన రికార్డ్స్ సరిగ్గా నమోదు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం ధరణి సమస్యలు దరఖాస్తులను పరిశీలించారు. వారి వెంట మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్ధార్ వీర్ సింగ్ పాల్గొన్నారు.