BREAKING: ఆర్మీ కంటైనర్ను ఢీకొట్టిన లారీ
AP: పేలుడు పదార్థాలతో ఉన్న ఆర్మీ కంటైనర్ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దాంతో లారీలో మంటలు వ్యాపించాయి. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. గాయపడిన డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు.