AP: ఉపాధి హామీ పథకం కూలీలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఉపాధి కూలీలకు రోజుకు రూ.300 ఇచ్చేందుకు కూటమి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు రూ.255 ఇస్తుండగా.. దీనిని రూ.300కు పెంచేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. దీనిపై అధికారులు ఇప్పటికే ఉపాధి కూలీలకు అవగాహన కల్పించారు. ఈ మేరకు కలెక్టర్లు, డ్వామా పీడీలకు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు.