దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.750 పెరిగి.. రూ.72,050 కు చేరింది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.820 పెరగడంతో.. రూ.78,600 కు చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ.4000 పెరిగి రూ.1,04,000 గా కొనసాగుతుంది.