
పెద్దపల్లి: ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీటి విడుదల: ఎమ్మెల్యే
పెద్దపల్లి జిల్లాలోని వివిధ మండలాలకు, పెద్దపల్లి నియోజకవర్గం చివరి ఆయకట్టు వరకు చివరితడి కింద ప్రత్యేకంగా డీ-83, డీ-86 ప్రధాన కాలువల ద్వారా ఈనెల 10 నుండి ఎస్సారెస్పీ నీరు విడుదల చేస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు తెలిపారు. పెద్దపల్లిలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు ఎస్సారెస్పీ నీరు సరఫరా చేస్తామని, రైతులు నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.