కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా (వీడియో)
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారు. ఒట్టావాలోని రైడో కాటేజ్‌లో సోమవారం ఆయన ప్రసంగించారు. లిబరల్ పార్టీ నాయకత్వానికి, ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లిబరల్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ట్రూడో ప్రధానిగా కొనసాగనున్నారు. 2015లో కెనడా 23వ ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.