పెద్దపల్లి: 17శాతం తేమ రాగానే ధాన్యం కొనుగోలు చేయాలి
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం 17 తేమ శాతం రాగానే కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ వేణు అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్, కొత్తపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం నాణ్యతను నిరంతరం పరిశీలించాలని, సెంటర్ కు కేటాయించిన మిల్లులకు త్వరితగతిన తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.