సుల్తానాబాద్: ఆయిల్ పామ్ ద్వారా అధిక లాభాలు
ఆయిల్ పామ్ ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చునని ఏడీఏ కాంతారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైతు వేదికలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట వేసే రైతులు మొక్కల కోసం డిడి ఎకరాకు 1140 కడితే సరిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ డేవిడ్ రాజు, తిరుమల ఆయిల్ గేమ్ కంపెనీ సీఈవో కేశవరావు, రైతులు పాల్గొన్నారు.