శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్ల పరిహారం: అల్లు అరవింద్
హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్ల పరిహారం అందజేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శించిన అనంతరం ఆయన ప్రకటించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించారు.