Oct 29, 2024, 11:10 IST/వేములవాడ
వేములవాడ
మామిడిపల్లి రాములగుట్టను సందర్శించిన రాజన్న ఆలయ ఈవో
Oct 29, 2024, 11:10 IST
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి స్వామివారి ఆలయానికి దత్తత దేవాలయమైన మామిడిపల్లి శ్రీసీతారామస్వామివారిని ఈవో కె. వినోద్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను పర్శిలించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనునిత్యం అర్చకులు పూజ నిర్వహిస్తున్నారు. వారి వెంట ఈఈ రాజేష్, డిఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణారావు ఉన్నారు.