Top 10 viral news 🔥
భయపెడుతున్న కొత్త వైరస్.. లక్షణాలివే
చైనాలో మరో కొత్త వైరస్ ప్రజలను భయపెడుతోంది. హ్యూమన్ మెటానియో వైరస్ (HMPV).. ఇది సోకితే దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్, న్యుమోనియా, బ్రాంకైటిస్, ఆస్తమా వంటి వాటికి ఇది దారితీసి రెస్పిరేటరీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ వైరస్ తీవ్రత మూడు నుంచి ఆరు రోజుల పాటు ఉంటుంది. అయితే ఈ వైరస్ వ్యాప్తి మన దేశంలో లేదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.