CBIకి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదు: సుప్రీం కోర్టు

68చూసినవారు
CBIకి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదు: సుప్రీం కోర్టు
రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్న కేంద్ర ఉద్యోగులపై FIR నమోదు చేసేందుకు CBIకి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించి CBI దర్యాప్తును AP హైకోర్టు గతంలో రద్దు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా HC తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. కేంద్ర ఉద్యోగులపై FIR నమోదుకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదని పేర్కొంది.

సంబంధిత పోస్ట్