టీడీపీలోకి వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్?
AP: వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ త్వరలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. నూజివీడులోని గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి పార్థసారధితో కలిసి జోగి రమేశ్ ర్యాలీలో పాల్గొన్నారు. కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉన్న జోగి రమేశ్... ఇప్పుడు సడెన్గా మంత్రి పార్థసారధితో కనిపించడంతో త్వరలోనే ఆయన టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.