AP: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం గాజుల కొల్లివలసలో దారుణం జరిగింది. ఆర్ఆర్ కాలనీకి చెందిన దామోదర పద్మ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన సోండి సురేశ్ కత్తితో మహిళ ఛాతీలో పొడిచి హత్య చేశాడు. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భర్త చనిపోయాడు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.