క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్ (వీడియో)
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంపై హీరో అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారు. 'గత 20 ఏళ్లుగా సినిమా చూసేందుకు నేను ఆ థియేటర్ వెళ్తున్నా. అయితే మొన్న సినిమా చూస్తుండగా మా మేనేజ్మెంట్ వచ్చి బయట గందరగోళంగా ఉంది.. వెళ్లిపోదామని చెప్పారు. ఆ తర్వాతి రోజు ఈ ఘటన గురించి తెలిసి షాక్కు గురయ్యాను. బాధతో వెంటనే స్పందించలేకపోయాను. ఆమె కుటుంబానికి సారీ చెబుతున్నా. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం' అని చెప్పారు.