కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. 30 నిమిషాల పాటు జరిగే ఈ ఎయిర్‌షోలో వాయుసేన విమానాలు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3-5 గంటల వరకు ట్యాంక్‌బండ్, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని, తమకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి చేశారు.