కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని హతమార్చిన తండ్రి(వీడియో)
తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి ఆమె తండ్రి హతమార్చాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో శనివారం జరిగింది. చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయప్రసాద్ కువైట్లో ఉంటున్నారు. ప్రసాద్ తన కుమార్తె(12)ను మరదలు లక్ష్మి ఇంట్లో వదిలి వెళ్లాడు. ఈక్రమంలో లక్ష్మి మామ గుట్ట ఆంజనేయులు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి కువైట్ నుంచి వచ్చి ఆంజనేయులును హత్య చేశాడు. అనంతరం కువైట్ వెళ్లి ఓ వీడియో విడుదల చేశారు.