డ్రాగన్ ఫ్రూట్ పండించడానికి కావాల్సిన నేలలు ఇవే
డ్రాగన్ ఫ్రూట్ మూడు రకాల్లో లభిస్తుంది. ఎరువు చర్మంతో లోపల ఎర్రని గుజ్జు (హైలోసెరియస్ పాలిరైజస్), ఎర్రని తోలుతో లోపల తెల్లని గుజ్జు (హైలోసెరియస్ అన్డేటస్), పసుపు తోలుతో లోపల తెల్లని గుజ్జు (హైలోసెరియస్ మెగాలంథస్). ఈ పండ్ల పెంపకానికి అన్ని రకాల నెలలు అనుకూలం. మురుగు నీరు పోయే సౌకర్యం గల ఇసుక నేలలు మంచివి. ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 ఉన్న అధిక సేంద్రియ పదార్థం గల నేలలు ఈ మొక్కల పెరుగుదలకు అనుకూలం.