సిరిసిల్ల: విద్యార్థులు ప్రతి పరీక్షలో రాణించేలా సిద్ధం చేయాలి : కలెక్టర్
విద్యార్థులు ప్రతి పరీక్షలో రాణించేలా సిద్ధం చేయాలని టీచర్లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి చిన్న బోనాలలోని గురుకుల విద్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, విద్యాలయం ఆవరణ, కిచెన్ గది, కూరగాయలు, బియ్యం, కోడిగుడ్లు, పండ్ల నాణ్యతను పరిశీలించారు. విద్యాలయం ఆవరణ స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.