మాజీ సర్పంచుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది: మాజీ మంత్రి (వీడియో)
TG: మాజీ సర్పంచులను అరెస్టులు చేసి నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మాజీ సర్పంచులకు మద్దతుగా హైదరాబాద్లోని తిరుమలగిరి పీఎస్ ముందు సోమవారం హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సర్పంచుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని అన్నారు. అర్ధరాత్రి పూట దొంగలను, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు మాజీ సర్పంచులను అరెస్టులు చేయడం మంచిది కాదని దుయ్యబట్టారు.