ఉత్తరాఖండ్లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 45 నుంచి 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి స్పందించారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.