AP: పింఛన్లు తీసుకోని వారు ఒకేసారి 3 నెలల పెన్షన్ తీసుకోవచ్చని సీఎం చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇకపై ఒక నెల, రెండో నెలలో పింఛన్లు తీసుకోకపోతే మరుసటి నెలలో తీసుకోవచ్చు. వచ్చే నెల నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. నవంబర్ నెలలో పింఛన్ తీసుకోని వారికి డిసెంబర్‌లో 2 నెలల పింఛన్ కలిపి ఇస్తారు. కాగా, నవంబర్‌లో 45 వేల మంది పింఛన్ తీసుకోలేదని అధికారులు గుర్తించారు.