వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉద్రిక్తత (వీడియో)
ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రజాదర్బార్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజాదర్బార్ సందర్భంగా జగన్ను చూసేందుకు ప్రజలు, వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు కార్యకర్తలను కంట్రోల్ చేయలేక.. వారిని చెదరగొట్టారు.