రాజ్యసభ పదవిపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వార్థం తెలియని ప్రజా నాయకుడని పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పవన్ ఢిల్లీలో పర్యటించారని, వ్యక్తిగత స్వార్థానికి పవన్ ఎప్పుడూ దూరమేనని తెలిపారు. తమ నాయకుడికి సేవ చేయడమే తన ఆశయమని.. తనకు ఎలాంటి రాజకీయ లక్ష్యాలు, ఆశయాలు లేవని స్పష్టం చేశారు. కాగా, రాజ్యసభ పదవిపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ 'ఎక్స్' వేదికగా నాగబాబు పోస్ట్ చేశారు.