ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ మధ్యనే తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిన కీర్తి సురేష్ నేడు తిరుమలలో పెళ్లి విషయాన్ని ప్రస్తావించింది. వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని కీర్తి సురేష్ దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం ముందు కీర్తి సురేష్ తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చారు. వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరగబోతున్నట్లు స్పష్టం చేసింది.