వైసీపీ లేని లోటు తీరుస్తున్న కూటమి ఎమ్మెల్యేలు!
ఏపీలో ప్రస్తుతం విపక్షం లేదు. 11 సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభకు వెళ్లడం లేదు. దాంతో కూటమి ఎమ్మెల్యేలు బడ్జెట్‌పై ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తున్నారు. విపక్షాల పని కూడా కూటమి ఎమ్మెల్యేలే చేస్తున్నారు. విమర్శించడం, ప్రశ్నించడంతో విపక్ష పని కూడా కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.