ఈ ఏడాది బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే
తెలంగాణ ఆడబిడ్డలు సంబరంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ తొమ్మిది రోజుల పాటూ తెలంగాణ వ్యాప్తంగా ఊరూ వాడా ఎక్కడ చూసినా సందడే. చిన్నా పెద్దా వేడుకలలో పాల్గొంటారు. ముచ్చటగా ముస్తాబై బతుకమ్మలు తయారు చేసి అంతా కలసి ఆడిపాడతారు. ఈ ఏడాది బతుకమ్మ పండుగ అక్టోబర్ 2 నుంచి 10 తేదీ వరకు జరుపుకోనున్నారు.