వెస్ట్ బెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం (వీడియో)
వెస్ట్ బెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కోల్కతా జిల్లా న్యూ అలీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీల్దా-బడ్జ్ బడ్జ్ రైల్వే లైన్ సమీపంలో ఉన్న మురికివాడలో శనివారం రాత్రి భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు కాస్తా చుట్టుపక్కల వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న 15 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.