పోలీసులే నాకు దారి ఇచ్చారు: అల్లు అర్జున్

79చూసినవారు
పోలీసులే నాకు దారి ఇచ్చారు: అల్లు అర్జున్
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. హైదరాబాద్‌లో తన ఇంటి వద్ద శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. తాను రోడ్ షో చేయలేదని, కారులో నుంచి కేవలం అభిమానులకు అభివాదం చేశానని తెలిపారు. తాను వెళ్తుంటే పోలీసులే దారి ఇచ్చారని, దీంతో పర్మిషన్ లేదనే విషయం తనకు తెలియలేదని అన్నారు. జాతీయ మీడియా ముందు తనను అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్