సెలవు రోజుల్లోనే అధికంగా దొంగతనాలు: పోలీసుల హెచ్చరిక
నగర ప్రాంతాల్లో పక్కింటి వారు ఉన్నారో లేరో అనే సంబంధం లేకుండా ఒకరికొకరు వ్యవహరిస్తుంటారు. దీంతో కాలనీల్లో దొంగలు యథేచ్ఛగా సంచరిస్తూ ఏ ఇంటికి తాళం ఉందో అని నిఘా వేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. సెలవుల్లో చాలా మంది సొంత ఊళ్లకు పయనమవటం, విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలకు ప్లాన్ చేసుకోవటం జరుగుతుంది. ఇదే అదునుగా భావించి ఇతర సమయాలతో పోలిస్తే సెలవు రోజుల్లో దొంగతనాలు 30 శాతం అధికంగా నమోదవుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు.