సినీ నటుడు శోభన్ బాబు తమ్ముడు కన్నుమూత
AP: అలనాటి సినీ నటుడు శోభన్ బాబు ఇంట విషాదం చోటు చేసుకుంది. శోభన్ బాబు తమ్ముడు ఉప్పు సాంబశివరావు కన్నుమూశారు. శనివారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. వీరి స్వగ్రామమైన కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చిన్న నందిగామలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆయన మేనల్లుడు రాజా తెలిపారు. కాగా, 2008 మార్చి 20న శోభన్ బాబు మృతి చెందగా.. తాజాగా అతని తమ్ముడు ప్రాణాలు విడవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.