AP: వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలంలో దారుణం జరిగింది. చెర్లోపల్లి గ్రామానికి చెందిన వీరనారాయణ అనే వ్యక్తిని బాలరాజు యాదవ్ గొడ్డలితో నరికి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న బాలరాజు యాదవ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.