
తెలుగు రాష్ట్రాల్లో విషాదం.. పిడుగుపాటుకు ఐదుగురి మృతి
ఏపీలోని కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు గురై ఆదివారం ముగ్గురు మృతి చెందారు. కౌతాళం మండలం కాత్రికి చెందిన అశోక్ (20), బాలయ్య (22)పై పిడుగు పడి మృత్యువాత పడ్డారు. కృష్ణగిరి మండలం కటారుకొండకు చెందిన బోయ శ్రీనివాసులుపై పిడుగు పడింది. తెలంగాణాలోని నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో నిన్న పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు. ఉప్పర్పల్లికి చెందిన ఆంజనేయులు (32), దాదన్పల్లికి చెందిన కురుమూర్తి (17) మృత్యువాత పడ్డారు.