అమ్మ లేస్తుందని పిల్లల ఎదురుచూపు

67చూసినవారు
అమ్మ లేస్తుందని పిల్లల ఎదురుచూపు
తల్లీబిడ్డల అనుబంధం అజరామరం. జంతువులైనా, మనుషులైనా తల్లి ప్రేమ మాత్రం ఒక్కటే. అయితే తల్లి కోసం కుక్క పిల్లలు ఎదురుచూపులు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి. కర్నూలు జిల్లా సి.బెళగల్ బస్టాండ్ ఆవరణలో ప్రమాదంలో తల్లి కుక్క చనిపోయింది. దానికి నాలుగు పాలు తాగే పిల్లలున్నాయి. ఆడుకుని అలసిపోయి వచ్చిన కుక్క పిల్లలు అమ్మ లేస్తుంది.. పాలిస్తుందని చూశాయి. ఎంతసేపటికి తల్లి లేవకపోవడంతో దీనంగా దాని చెంతనే నిద్రపోయాయి.

సంబంధిత పోస్ట్