

పవన్‌ను సీఎంగా చూడాలి: జనసేన నేత (వీడియో)
AP: మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ స్పందించారు. జనసేన నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని ఆయన చెప్పారు. మంత్రి లోకేశ్‌ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. తాము కూడా పవన్‌ను ఏపీకి సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.