పవన్‌వి మూర్ఖత్వ, విధ్వంస రాజకీయాలు: ప్రకాశ్ రాజ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ అంటే మీకెందుకు కోపమని జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘పవన్ మూర్ఖత్వ, విధ్వంస రాజకీయాలు చేస్తున్నారు. అది నచ్చట్లేదు. ప్రజలు ఆయనను ఎన్నుకున్నది దీని కోసం కాదుగా. అడిగే వాడు ఒకడుండాలి. అందుకే నేను ప్రశ్నిస్తున్నా.’ అని ప్రకాశ్ రాజ్ సమాధానమిచ్చారు. కాగా, తిరుమల లడ్డూ వ్యవహరంలో పవన్ తీరును ప్రకాశ్ రాజ్ వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.