ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఖాళీల వివరాలను ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించింది. 18 కేటగిరీల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్టీసీ పేర్కొంది. 3,673 డ్రైవర్, 1,813 కండక్టర్, 579 అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్, 656 జూనియర్ అసిస్టెంట్, 208 డిప్యూటీ సూపరింటెండెంట్, 207 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీలు, 179 మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది.