గురక వల్ల వచ్చే క్యాన్సర్లు ఇవే!
గురక పెడుతున్నప్పుడు నిద్రలో కాసేపు శ్వాస నిలిచి పోతుంది. దీంతో తాత్కాలికంగా రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తగ్గుతాయి. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (గురక) పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. స్లీప్ అప్నియాకూ గుండెజబ్బు, రక్తనాళాల సమస్యలు, నాడీ జబ్బుల వంటి వాటికీ సంబంధం ఉంటున్నట్టు ఇప్పటికే తెలుసు. తాజాగా దీని వల్ల జీర్ణకోశ, కిడ్నీ, రొమ్ము క్యాన్సర్ల ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది.