ఏ రాష్ట్రం వాళ్లు ఆ రాష్ట్రంలో రేపు రిపోర్ట్ చేసి తీరాలని క్యాట్ ఇచ్చిన తీర్పుపై ఏపీ కేడర్ IAS అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్‌రాస్, సృజన హైకోర్టును ఆశ్రయించాలని డిసైడ్ అయ్యారు. రేపు (బుధవారం) లంచ్ మోషన్ దాఖలు చేయనున్నారు. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని, DOPT ఫైనల్ కాదని, కోర్టుకు వెళ్లే హక్కు IASలకు ఉందని వీరి తరపు న్యాయవాది మీడియాకు చెప్పుకొచ్చారు.