పాత కక్షలతో కత్తుల దాడి
వేంసూరు మండలం మర్లపాడులో పాత కక్షల నేపథ్యాన ఓ వ్యక్తి కత్తితో దాడి చేయగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మంగళవారం అందరూ చూస్తుండగానే గ్రామ సెంటర్లో, మునుపెన్నడూ లేని విధంగా కత్తులతో దాడి జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన ఇస్సంపల్లి సురేష్ అదే గ్రామానికి చెందిన నడ్డి రవి మధ్య గతంలో కుటుంబ గొడవలు ఉన్నాయి. పలుమార్లు పెద్దల సమక్షాన పంచాయితీ కూడా నిర్వహించారు.