జైనూర్: ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షులు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళకు చికిత్స పూర్తి కావడంతో ఆదివారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. ఈ మేరకు మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణక్క, డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. నగదు, దుస్తులను అందించి వాహనంలో ఆమెను స్వగ్రామానికి పంపారు.