సంక్రాంతి పండుగ సందర్భంగా దృష్ట్యా అదనంగా 7,200 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మంగళవారం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. జనవరి 8 నుంచి జనవరి 13 వరకు అదనంగా 3,900 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నుంచి పలు చోట్లకు 2,153 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. బెంగళూరు నుంచి పలుచోట్లకు 375 బస్సులు నడపనుంది.