సంక్రాంతి సీజన్... APSRTCకి రికార్డ్ స్థాయి ఆదాయం
AP: సంక్రాంతి పండగ సీజన్లో APSRTC రికార్డు స్థాయిలో ఆదాయం ఆర్జించింది. ఈ నెల 8 నుంచి 20 వరకు 11 రోజుల పాటు 9 ,097 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ గణనీయంగా ఆదాయం ఆర్జించినట్లు వెల్లడించింది. ఈనెల 20న ఒకేరోజు రూ.23.71 కోట్ల ఆదాయం పొంది రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్లో మరో మూడు రోజుల పాటు రోజుకు రూ.20 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించినట్లు ఆర్టీసీ వెల్లడించింది.