‘అది సాంకేతిక తప్పిదం’.. హిందీ వివాదంపై స్పందించిన ఎల్ఐసీ
LICకి చెందిన హోంపేజీలో హిందీ భాషలో కనిపించడంతో తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందీని బలవంతంగా రుద్దే సాధనంగా ఎల్ఐసీని మార్చేశారని అన్నారు. ఈ వివాదంపై LIC స్పందించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందంటూ వివరణ ఇచ్చింది. సమస్య పరిష్కారం అయ్యిందని, హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో లభిస్తోందని తెలిపింది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది.