ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏపై సెర్చ్ వారెంట్ జారీ
AP: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డిపై పోలీసులు సెర్చ్ వారెంట్ జారీ చేశారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం అంబకపల్లిలో రాఘవ రెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు శనివారం నోటీసులు అంటించారు. ఇంట్లో సోదాలకు అనుమతి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా, కడప జిల్లాలో పలువురు వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.