టాలీవుడ్ స్టార్ సింగర్లు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలోనే వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అంత సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటీ? ఇది నిజంగానే ఒరిజినల్ ఫోటోనా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, వీరిద్దరూ కలిసి ఇస్మార్ట్ శంకర్‌లో ‘ఉండిపో’, ఆచార్య సినిమాలో ‘నీలాంబరి’ పాటలు పాడారు.