Top 10 viral news 🔥
ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు-2024కు అసెంబ్లీ ఆమోదం
ఏపీలో పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. జనాభా వృద్ధి రేటు పెంపులో భాగంగా ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు-2024కు ఆమోదం తెలిపింది. ఇకపై ఎందరు పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లభించింది. మండలిలో ఈ బిల్లులు ఆమోదం పొందిన వెంటనే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది.