TG: సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్ల ఘటనలో అరెస్టైన రైతులను సోమవారం సెంట్రల్ జైలులో ఈటల పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్లుగా రేవంత్ రెడ్డికి ఓటు వేసిన కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి తయారైంది. కాంగ్రెస్ వాళ్లే లగచర్ల ఘటనకు స్కెచ్ వేసుకుని రైతులపై దాడులు చేయించారు" అని ఆరోపించారు.